మద్యం మాఫియా కేసులో చిలుకను విచారించిన పోలీసులు

అక్రమ మద్యం తయారీ ముఠాను పట్టుకునేందుకు బిహార్‌ పోలీసులు ఓ చిలుకను విచారించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 27 Jan 2023 04:16 IST

అక్రమ మద్యం తయారీ ముఠాను పట్టుకునేందుకు బిహార్‌ పోలీసులు ఓ చిలుకను విచారించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గయలో మద్యం మాఫియాకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ఓ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే మద్యం వ్యాపారి కుటుంబం అక్కడి నుంచి పరారైంది. కానీ ఆ ఇంట్లోని పంజరంలో పెంపుడు చిలుక ఉండిపోయింది. చిలుకను చూసిన ఇన్‌స్పెక్టర్‌ దాన్ని విచారించటం మొదలుపెట్టారు. ‘మీ సర్‌ అమృత్‌ ఎక్కడికి వెళ్లాడు? వాళ్లు పాత్రలో మద్యం తయారు చేశారా?’ అని ప్రశ్నలు అడిగారు. అయితే చిలుక నోటి నుంచి ‘కటోరా’ (పాత్ర) అనే పదం తప్ప మరేమీ రాలేదు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని