పాత్రికేయుణ్ని చెట్టుకు కట్టి చితకబాదారు

ఓ యువ జర్నలిస్టుపై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి.. విచక్షణరహితంగా చావబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో జరిగింది.

Published : 29 Jan 2023 03:28 IST

భోపాల్‌: ఓ యువ జర్నలిస్టుపై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి.. విచక్షణరహితంగా చావబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్‌ యాదవ్‌ స్థానికంగా ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో నారాయణ్‌ యాదవ్‌ అనే వ్యక్తి అడ్డగించాడు. జనవరి 1న జరిగిన ఓ సంఘటన గురించి వాదనకు దిగాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న మరికొందరు ప్రకాశ్‌ను దుర్భాషలాడటంతో మాటామాటా పెరిగింది. ప్రకాశ్‌ యాదవ్‌ను వారు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారం కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని