గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్‌ శకటం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది.

Published : 31 Jan 2023 04:49 IST

త్రివిధ దళాల్లో.. పంజాబ్‌ రెజిమెంట్‌

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. కవాతు చేసిన శకటాల్లో వివిధ విభాగాల్లో తొలి మూడు స్థానాలకు ఎంపికైన వాటిని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో గిరిజన వ్యవహారాల శాఖ శకటం ఉత్తమ స్థానం సాధించింది. త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్‌ రెజిమెంట్‌ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కేంద్ర సాయుధ పోలీసు దళాలకు సంబంధించి సీఆర్పీఎఫ్‌ మొదటి బహుమతి గెలుచుకుంది. మై గవ్‌ వెబ్‌సైట్‌లో నమోదైన ఓటింగ్‌లో గుజరాత్‌ శకటం, వాయుసేన కవాతు, హోంశాఖ శకటాలకు ఆయా విభాగాల్లో తొలి స్థానాలు దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని