Agniveer: ‘అగ్నివీరుల’ నియామక ప్రక్రియలో మార్పు
భారత సైన్యంలో చేరేందుకు ఉద్దేశించిన అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానం మారింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై మొదట్లోనే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) ఉంటుంది.
ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఉత్తీర్ణులయ్యాకే ఇతర పరీక్షలు
దిల్లీ: భారత సైన్యంలో చేరేందుకు ఉద్దేశించిన అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానం మారింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై మొదట్లోనే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు భారత సైన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలోనే నియామక ప్రకటన జారీ చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ సీఈఈ ఉంటుందని అధికారవర్గాల సమాచారం. అగ్నివీరుల నియామకానికి గతంలో మొదటిదశలో శారీరక సామర్థ్య పరీక్షలు, రెండోదశలో వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాతే ఆన్‌లైన్ సీఈఈ జరిపేవారు. ఇపుడు ఆన్‌లైన్ పరీక్షను ముందుకు తెచ్చారు. ‘‘శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే ర్యాలీలకు అభ్యర్థులు భారీసంఖ్యలో హాజరవుతారు. రద్దీని నియంత్రిస్తూ నియామక విధానాన్ని సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి నియామక ప్రక్రియలో కొత్త విధానం అమలులోకి వస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?