గుజరాత్‌లో హిల్లరీ క్లింటన్‌ పర్యటన

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఆమె పర్యటన మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.

Published : 06 Feb 2023 04:24 IST

అహ్మదాబాద్‌: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఆమె పర్యటన మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. గాంధేయవాది, సామాజిక కార్యకర్త ఇలా భట్‌ స్థాపించిన మహిళా స్వయం సహాయక సంఘం(సేవా) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె ఆదివారం పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇలా భట్‌కు నివాళులర్పించడంతో పాటు సేవా సభ్యులతో ముచ్చటించారు. వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అసంఘటిత రంగంలో ఉన్న మహిళలకు సవాలుగా నిలిచే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవడానికి కొంతమంది ఔత్సాహికులు కలిసి వాతావరణ మార్పుల నిధి (సీఆర్‌ఎఫ్‌)ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని