Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్‌

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల కాలంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇందుకోసం మన దేశాన్ని వీడి వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

Published : 07 Feb 2023 09:48 IST

ఆరేళ్లలో దేశాన్ని వీడిన విద్యార్థులు 30 లక్షలకుపైనే

దిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల కాలంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇందుకోసం మన దేశాన్ని వీడి వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2017లో 4.54 లక్షల మంది, 2018లో 5.17లక్షలు, 2019లో 5.86 లక్షలు, 2020లో 2.59 లక్షలు, 2021లో 4.40 లక్షలు, 2022లో 7.50లక్షల మంది చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభకు తెలియజేసింది. కరోనా కారణంగా 2020, 2021లలో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని