Higher pension: ..వారికీ వెసులుబాటు.. మే 3 వరకు అధిక పింఛనుకు గడువు

ఉద్యోగుల పింఛను పథకం 1995 (ఈపీఎస్‌ 95) కింద అర్హులై.. 2014 సెప్టెంబరు కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈపీఎఫ్‌వో మే 3 వరకూ పొడిగించింది.

Updated : 14 Mar 2023 09:54 IST

2014 సెప్టెంబరు ముందు రిటైరైన వారికి అవకాశం

దిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం 1995 (ఈపీఎస్‌ 95) కింద అర్హులై.. 2014 సెప్టెంబరు కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈపీఎఫ్‌వో మే 3 వరకూ పొడిగించింది. అంతకు ముందు ఈ గడువు మార్చి 3తో ముగిసింది. ‘‘ఉద్యోగ, యాజమాన్య సంఘాల విజ్ఞప్తుల నేపథ్యంలో అధిక పింఛనుకు సంబంధించిన జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తుల సమర్పణకు మే 3, 2023 వరకు గడువు పొడిగిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని సోమవారం కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన అన్ని రకాల ఈపీఎఫ్‌వో చందాదారులకూ ఈ దరఖాస్తుల సమర్పణకు మే 3వ తేదీని తుది గడువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు