Aadhaar: ఆధార్‌ అప్‌డేషను మూణ్నెల్లు ఉచితం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఏఐ) మార్చి 15 నుంచి జూన్‌ 14 వరకు మూణ్నెల్లపాటు ఆధార్‌ డాక్యుమెంట్ల అప్‌డేషను ఆన్‌లైను ద్వారా.

Published : 16 Mar 2023 07:55 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఏఐ) మార్చి 15 నుంచి జూన్‌ 14 వరకు మూణ్నెల్లపాటు ఆధార్‌ డాక్యుమెంట్ల అప్‌డేషను ఆన్‌లైను ద్వారా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఇలా అప్‌డేషను చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకొన్న తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు. నిబంధనల మేరకు.. ఆధార్‌ సంఖ్య పొందినవారు ప్రతి పదేళ్లకోమారు సంబంధిత డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు చూపాలి. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులకు సాధారణ చార్జీలు వర్తిస్తాయి. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేషను చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని