కొచ్చి డంపింగ్‌ యార్డ్‌లో అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్‌జీటీ

కేరళలోని కొచ్చిలో చెత్తకుప్ప(డంపింగ్‌ యార్డ్‌) వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 19 Mar 2023 03:33 IST

కొచ్చి: కేరళలోని కొచ్చిలో చెత్తకుప్ప(డంపింగ్‌ యార్డ్‌) వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి గానూ కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల భారీ జరిమానా విధించింది. కొచ్చి శివారు బ్రహ్మపురం ప్రాంతంలోని ఓ భారీ చెత్తకుప్ప వద్ద మార్చి 2వ తేదీ సాయంత్రం మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. కొచ్చి నగరమంతా దట్టంగా పొగ కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రమాదం కొచ్చిలో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్లు మీడియా కథనాలు రావడంతో ఘటనపై ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ విఫలమైనందుకు రూ.100కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు