Gold Rate: కొనగలమా బంగారం.. అంతర్జాతీయ పరిణామాలతో భగ్గుమన్న ధరలు
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకులు దివాలా తీయడం, అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెంచుతారనే సంకేతాల నడుమ స్టాక్‌మార్కెట్లు నష్టపోతున్నాయి.
రూ.62 వేలను తాకి రూ.61,300కు స్థిరపడిన వైనం
ఈనాడు వాణిజ్య విభాగం: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకులు దివాలా తీయడం, అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెంచుతారనే సంకేతాల నడుమ స్టాక్‌మార్కెట్లు నష్టపోతున్నాయి. అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితం అని భావించే బంగారం, వెండిపైకి పెట్టుబడులు మళ్లుతున్నందున, ఈ విలువైన లోహాల ధరలు బాగా పెరుగుతున్నాయి. సోమవారం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 2005 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ.82.56కు చేరడంతో, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఉదయం ఒక దశలో రూ.62,000ను తాకింది. సాయంత్రానికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,978 డాలర్లకు దిగిరావడంతో, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.61,300గా ఉంది. శనివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.61,600 కంటే ఇది కొంచెం తక్కువ. ఇక వెండి కూడా కిలో రూ.70,500కు చేరింది.
ఫెడ్ నిర్ణయాలు, ఆర్థిక పరిణామాలపైనే ధర ఆధారం
ఈ నెల 21, 22 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుంది. ఇందులో వడ్డీరేట్లు పెంచుతారా, పెంపును వాయిదా వేస్తారా అనే దానిపై బంగారం ధరలు ఆధారపడతాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సంక్షోభం సర్దుమణిగితేనే మళ్లీ ధరలు అదుపులోకి వస్తాయనే అంచనాను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1950-2130 డాలర్ల మధ్య కదలాడొచ్చని పేర్కొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం