ఓపీఎస్‌ కోసం సమ్మె చేస్తే తీవ్ర చర్యలు

పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలంటూ జరుగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదని తన ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Published : 22 Mar 2023 04:32 IST

ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

దిల్లీ: పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలంటూ జరుగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదని తన ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సమ్మెలో పాల్గొన్నా, నిరసన తెలిపినా తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఓపీఎస్‌ డిమాండులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం ర్యాలీలు చేపట్టాలని జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రీస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ర్యాలీల్లో పాల్గొనకుండా నిషేధించాలని, సాధారణ సెలవులనూ మంజూరు చేయవద్దని సంబంధిత అధికారులకు డీవోపీటీ సూచించింది. వీటిని అతిక్రమిస్తే సీసీఎస్‌ 1964 నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నిరసన చేపట్టిన ఉద్యోగుల వేతనాల్లో కోతతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమించి ఏ ఉద్యోగైనా.. నిరసనలో పాల్గొంటే సాయంత్రంలోగా డీవోపీటీకి తెలియజేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని