వాహ్‌.. బేటా!.. తాజ్‌ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు

తాజ్‌మహల్‌.. ప్రపంచానికి ప్రేమికుల చిహ్నమే కావచ్చు. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా ముంద్రా ప్రాంతవాసి మహమ్మద్‌ ఇబ్రహీంకు మాత్రం అమ్మ జ్ఞాపకాల గుర్తుగా మిగిలిపోతుంది.

Updated : 22 Mar 2023 06:54 IST

తాజ్‌మహల్‌.. ప్రపంచానికి ప్రేమికుల చిహ్నమే కావచ్చు. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా ముంద్రా ప్రాంతవాసి మహమ్మద్‌ ఇబ్రహీంకు మాత్రం అమ్మ జ్ఞాపకాల గుర్తుగా మిగిలిపోతుంది. 32 ఏళ్లుగా మంచానికే పరిమితమైన రజియా (85) తాజ్‌మహల్‌ను చూడాలన్న తన చిరకాల వాంఛను కుమారుడి ముందు వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఇబ్రహీం దంపతులు సోమవారం ఆగ్రాకు తీసుకువచ్చారు. ఇందుకోసం దాదాపు 1,200 కిలోమీటర్లు రోజంతా ప్రయాణం చేశారు. తల్లిని స్ట్రెచర్‌పైనే తిప్పుతూ తాజ్‌మహల్‌ మొత్తం చూపించారు. నిస్తేజంగా పడున్న రజియా ఆ పాలరాతి నిర్మాణాన్ని చూసి ఓ చిరునవ్వు నవ్వారు. తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇబ్రహీం దంపతులు మంచి పని చేశారని పలువురి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు