నియంత్రణ రేఖ సమీపంలో కొలువుదీరిన శారదాదేవి

జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కర్నాహ్‌ సెక్టార్‌లో శారదా దేవి కొలువుదీరింది. ఈ మేరకు కర్ణాటకలోని శృంగేరి శారద మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ‘మాతా శారదాదేవి’ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం వీడియో సమావేశం విధానంలో ప్రారంభించారు.

Published : 23 Mar 2023 05:32 IST

ఆలయాన్ని వీడియో సమావేశం విధానంలో ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కర్నాహ్‌ సెక్టార్‌లో శారదా దేవి కొలువుదీరింది. ఈ మేరకు కర్ణాటకలోని శృంగేరి శారద మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ‘మాతా శారదాదేవి’ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం వీడియో సమావేశం విధానంలో ప్రారంభించారు. అధికరణం 370 రద్దు.. కేంద్ర పాలిత ప్రాంతంలో సంప్రదాయాలు, సంస్కృతిని వెనక్కు తెస్తోందని చెప్పారు. ఈ ఆలయం ప్రారంభం కశ్మీర్‌లో నూతన ఉదయం ప్రారంభానికి, శారదా సంస్కృతిని పునరుజ్జీవింపజేసే తపనకు నిదర్శనమన్నారు. ‘‘ఉగాది రోజున మాతా శారదా దేవి ఆలయాన్ని భక్తుల దర్శనాల కోసం ప్రారంభించాం. ఇది దేశవ్యాప్తంగా భక్తులకు శుభసూచకం. దేశం మొత్తం మీద శారదాదేవి ఆశీస్సులు ఉంటాయి’’ అని అమిత్‌ షా చెప్పారు. ఈ ఆలయ ప్రారంభోత్సవంలో నేరుగా పాల్గొనలేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. జమ్మూ-కశ్మీర్‌ తదుపరి పర్యటనలో తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటానని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని