Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా

సెల్‌ఫోన్లు లేని కాలంలో జీవించిన మహాత్మా గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, అంబేడ్కర్‌ లాంటి ప్రముఖ వ్యక్తులు సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేశారు కేరళకు చెందిన కళాకారుడు జో జాన్‌ ముల్లోర్‌.

Updated : 26 Mar 2023 08:43 IST

కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కారం

సెల్‌ఫోన్లు లేని కాలంలో జీవించిన మహాత్మా గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, అంబేడ్కర్‌ లాంటి ప్రముఖ వ్యక్తులు సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేశారు కేరళకు చెందిన కళాకారుడు జో జాన్‌ ముల్లోర్‌. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. కృత్రిమ మేధ సాంకేతికతకు సృజనాత్మకతను జోడించారు. ‘మిడ్‌ జర్నీ’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, మదర్‌ థెరెసా, కార్ల్‌ మార్క్స్‌, చెగువేరా వంటి ప్రముఖుల చిత్రాలు తయారు చేశారు. అలా సిద్ధం చేసిన చిత్రాలకు రీపెయింట్‌ వేయడానికి ఫొటో షాప్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. ‘హిస్టారికల్‌ సెల్ఫీస్‌’ పేరుతో వీటిని విడుదల చేశారు. వాటిని చూస్తే వారంతా నిజంగా సెల్ఫీలు తీసుకున్నారా అనిపిస్తుంది. ఈ చిత్రాలకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ ఫార్మాట్‌లో ఒక చిత్రాన్ని రూపొందించడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని జాన్‌ చెప్పారు. ఆయన 17 ఏళ్లు దుబాయ్‌లో ఉన్నారు. ఆ సమయంలో దుబాయ్‌ మొత్తాన్ని పచ్చదనంతో నింపేస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో ఫొటో క్రియేట్‌ చేశారు. దాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రసారం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని