అరుణాచల్‌లో జీ-20 సమావేశానికి చైనా డుమ్మా

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌ వేదికగా జీ-20 కూటమి నిర్వహించిన ఓ కీలక సమావేశానికి చైనా గైర్హాజరవడం తాజాగా చర్చనీయాంశమైంది.

Published : 28 Mar 2023 05:10 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌ వేదికగా జీ-20 కూటమి నిర్వహించిన ఓ కీలక సమావేశానికి చైనా గైర్హాజరవడం తాజాగా చర్చనీయాంశమైంది. ‘రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ ఇనీషియేటివ్‌’ అనే అంశంపై శని, ఆదివారాల్లో ఈ భేటీని గోప్యంగా నిర్వహించారు. భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. చైనా ప్రతినిధి మాత్రం హాజరు కాలేదని అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అరుణాచల్‌ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు