అమ్మవారికి నైవేద్యంగా నాలుక

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌ జిల్లాకు చెందిన ఓ భక్తుడు నాలుకను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు.

Published : 29 Mar 2023 04:49 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌ జిల్లాకు చెందిన ఓ భక్తుడు నాలుకను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. వృద్ధుడు చేసిన ఈ పనితో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఫతేపుర్‌కు చెందిన బాబురామ్‌ పాశ్వాన్‌(65) నవరాత్రి సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుగౌలి గ్రామ సమీపంలోని శివభవాని మాత ఆలయానికి దర్శనం కోసం వెళ్లాడు. అమ్మవారిని దర్శించుకునే క్రమంలో తన నాలుకలోని సగభాగాన్ని కోసేసుకున్నాడు. అనంతరం ఆ వృద్ధుడికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని