భారత్‌లో పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా స్తంభన

పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతాను గురువారం భారత్‌లో నిలిపేశారు. @GovtofPakistan చిరునామాతో ఉన్న ఖాతాను చట్టపరమైన డిమాండ్‌ మేరకు భారత్‌లో నిలిపివేసినట్లు సందేశం కనిపిస్తోంది.

Updated : 31 Mar 2023 05:38 IST

ఆ దేశ రేడియో హ్యాండిల్‌ కూడా నిలుపుదల

దిల్లీ: పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతాను గురువారం భారత్‌లో నిలిపేశారు. @GovtofPakistan చిరునామాతో ఉన్న ఖాతాను చట్టపరమైన డిమాండ్‌ మేరకు భారత్‌లో నిలిపివేసినట్లు సందేశం కనిపిస్తోంది. దీంతోపాటు @RadioPakistanపేరుతో ఉన్న పాక్‌ రేడియో ఖాతానూ ట్విటర్‌ భారత్‌లో స్తంభింపజేసింది. అయితే ఈ డిమాండ్లు ఎవరి నుంచి వచ్చాయన్నది ట్విటర్‌ వెల్లడించలేదు. పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతాను భారత్‌లో నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. 2022 అక్టోబరులో ఆ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అంతకుముందు కూడా పలుమార్లు ఈ చర్య చేపట్టారు. ట్విటర్‌ మార్గదర్శకాల ప్రకారం కోర్టు ఆదేశాలు, ఇతర లీగల్‌ డిమాండ్లకు అనుగుణంగా ఈ ఖాతాలను నిలిపివేస్తారు. ఇలా చేస్తే ఆ దేశంలో సంబంధిత ట్విటర్‌ ఖాతా కనిపించదు. ఇతర దేశాల్లో ఆ ఖాతాపై ఎలాంటి ప్రభావమూ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని