జంతువులకు చట్టపరమైన అస్తిత్వం కుదరదు

జంతువులను చట్టపరమైన అస్తిత్వం ఉన్న ప్రాణులుగా గుర్తించి మనుషులకున్న హక్కులను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Published : 01 Apr 2023 05:09 IST

దిల్లీ: జంతువులను చట్టపరమైన అస్తిత్వం ఉన్న ప్రాణులుగా గుర్తించి మనుషులకున్న హక్కులను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ తమకు అసాధారణ న్యాయాధికారాలను ఇచ్చినా, వాటిని ఉపయోగించి పిటిషనరు విన్నపాన్ని మన్నించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్ధీవాలాల ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో పంజాబ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌ హైకోర్టులు.. అన్ని జంతువులకూ చట్టపరంగా అస్తిత్వం ఉందని, మనుషులంతా వాటికి పితృ సమానులుగా వ్యవహరించాలని తీర్పు చెప్పాయి. సుప్రీంకోర్టు నుంచి ఇదే తరహా తీర్పును ఆశిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు