Uttar Pradesh: ఇది రియల్‌ లైఫ్‌ ‘బ్రహ్మోత్సవం’.. 138 ఏళ్ల మూలాలను ముద్దాడిన సునీతి

తన పూర్వీకులను అన్వేషిస్తూ ట్రినిడాడ్‌ - టొబాగోకు చెందిన సునీతి మహారాజ్‌ చేసిన ప్రయత్నం ఫలించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ జౌన్‌పుర్‌ జిల్లా అదిపుర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

Updated : 12 Apr 2023 09:24 IST

జౌన్‌పుర్‌: మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా గుర్తుంది కదా..! ఆ సినిమా తరహా సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగింది. తన పూర్వీకులను అన్వేషిస్తూ ట్రినిడాడ్‌ - టొబాగోకు చెందిన సునీతి మహారాజ్‌ చేసిన ప్రయత్నం ఫలించిన ఘటన జౌన్‌పుర్‌ జిల్లా అదిపుర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. 138 ఏళ్ల క్రితం నాటి తమ వంశ మూలాలను కనుగొనేందుకు సునీతి చేపట్టిన అన్వేషణలో ఇండెంచర్డ్‌ లేబరర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు దిలీప్‌ గిరి ప్రముఖ పాత్ర పోషించారు. ‘‘మా ముత్తాత నారాయణ్‌ దూబేను ఒప్పంద కార్మికుడిగా బ్రిటీషర్లు 1885లో ట్రినిడాడ్‌ - టొబాగోకు తరలించారు. అయితే భారత్‌లో గల నా పూర్వీకుల మూలాలను సందర్శించాలన్న నా ఆశను కోల్పోలేదు. నేను నా కుటుంబంలో నాల్గవ తరానికి చెందినదానను’’ అని సునీతి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని