Atiq Ahmed: యూపీఏను కాపాడిన అతీక్‌ ఓటు

అమెరికాతో అణు ఒప్పందం సందర్భంగా ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి యూపీఏ ప్రభుత్వం గట్టెక్కడానికి అప్పట్లో ఎంపీగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ ఓటూ ఉపయోగపడింది.

Updated : 17 Apr 2023 11:29 IST

దిల్లీ: అమెరికాతో అణు ఒప్పందం సందర్భంగా ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి యూపీఏ ప్రభుత్వం గట్టెక్కడానికి అప్పట్లో ఎంపీగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ ఓటూ ఉపయోగపడింది. రాజేశ్‌ సింగ్‌ అనే రచయిత సుమారు 100కుపైగా కేసులున్న ఆరుగురు ఎంపీలపై ‘బాహుబలీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌: ఫ్రం బుల్లెట్‌ టు బ్యాలెట్‌’ పుస్తకం రాశారు. అందులో అతీక్‌ పేరుంది. అణు ఒప్పందం నేపథ్యంలో యూపీఏకు లెఫ్ట్‌ మద్దతు ఉపసంహరించడంతో సమాజ్‌వాదీ మద్దతు అవసరమైంది. అయితే అప్పటికే అతీక్‌ను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. కానీ అతీక్‌ సహా ఈ ఆరుగురు నేరచరిత్ర ఉన్న ఎంపీలు అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.


2 వారాల కిందే సుప్రీంకు అతీక్‌

దిల్లీ: హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ రెండు వారాల కిందే రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో పోలీసు విచారణ సందర్భంగా తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారన్న ఆయన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర యంత్రాంగం తగిన భద్రత కల్పించగలదని స్పష్టం చేసింది. రక్షణ కోసం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని అతీక్‌కు స్వేచ్ఛనిచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన కేసు కాదని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని