చెత్త కుప్పలో దొరికిన చిన్నారికి సగం ఆస్తి..!

చెత్త కుప్పలో దొరికిన శిశువును అక్కున చేర్చుకోవడమే కాక, తన సగం ఆస్తిని రాసిచ్చేందుకు పెద్ద మనసుతో ముందుకొచ్చింది ఓ మహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆ మహిళ పేరు లత.

Updated : 18 Apr 2023 08:46 IST

రాసిచ్చేందుకు ముందుకు వచ్చిన మహిళ

చెత్త కుప్పలో దొరికిన శిశువును అక్కున చేర్చుకోవడమే కాక, తన సగం ఆస్తిని రాసిచ్చేందుకు పెద్ద మనసుతో ముందుకొచ్చింది ఓ మహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆ మహిళ పేరు లత. అలీగఢ్‌ జిల్లా స్వర్ణ జయంతి నగర్‌లో నివసించే ఆమె సోమవారం ఉదయం పాల కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది.

దీంతో వెంటనే బిడ్డను చేతుల్లోకి తీసుకొని చుట్టుపక్కల వారందరినీ ఆరా తీసింది. ఎవరి బిడ్డో తెలియదని వారు చెప్పడంతో ఆ పసిగుడ్డును తన ఇంటికి తీసుకెళ్లింది. చిన్నారికి స్నానం చేయించి పాలు పట్టింది. బిడ్డను దత్తత తీసుకొని, తన పేరు మీద ఉన్న ఆస్తిలో సగ భాగాన్ని ఇప్పుడే పాప పేరు మీద రాస్తానని లత ముందుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు లత పెద్ద మనసును అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని