అప్పటికే పదిమంది పిల్లలు.. మహిళకు ప్రియుడితో మళ్లీపెళ్లి

ఆరేళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. అప్పటికే పదిమంది పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత గ్రామంలోని ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది.

Updated : 30 Apr 2023 07:23 IST

ఆరేళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. అప్పటికే పదిమంది పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత గ్రామంలోని ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. ఏడాది క్రితం గ్రామం నుంచి ఇద్దరూ పరారై వేరేచోట కాపురం పెట్టారు. ఈ జంటను మళ్లీ స్వస్థలానికి పిలిపించి ఆలయంలో పెళ్లి చేసి పెద్దమనసు చాటుకున్నారు ఆ గ్రామస్థులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా బహల్‌గంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. సోనీ శర్మ(42), బాలేంద్ర (40) గ్రామపెద్దల దీవెనలతో కొత్తజీవితం ప్రారంభించారు. స్థానిక గురుకుల పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ జైప్రకాశ్‌ షాహీ.. ఇద్దరినీ ఒప్పించాక గ్రామంలోని శివాలయంలో వివాహం జరిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని