వధువు ముఖంపై సిందూరం చల్లిన వరుడు.. వివాహం రద్దు చేసుకున్న పెళ్లికుమార్తె

ముహూర్తం సమయానికి వరుడు మద్యం తాగి, వధువుపై సిందూరం చల్లిన కారణంగా ఓ యువతి మండపంలోనే పెళ్లికి నిరాకరించింది.

Updated : 07 May 2023 08:54 IST

ముహూర్తం సమయానికి వరుడు మద్యం తాగి, వధువుపై సిందూరం చల్లిన కారణంగా ఓ యువతి మండపంలోనే పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా.. వధూవరులు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా మీర్జాపుర్‌ జిల్లా మాణిక్‌పుర్‌ చేరుకున్నారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడు.. వధువుకు సిందూరం పెట్టలేకపోయాడు. అంతేకాకుండా ఆమెపై సిందూరం చల్లటం ప్రారంభించాడు. ఆపే ప్రయత్నం చేయడంతో వధువుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. అనంతరం ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. వివాహ  ఖర్చులు తిరిగి చెల్లించటానికి వరుడి కుటుంబం అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని