Medicine-Engineering: ఒకే కోర్సులో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌..

దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సుగా ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

Updated : 12 May 2023 07:18 IST

ఐఐటీ మద్రాస్‌ వినూత్న ప్రయోగం

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సుగా ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్‌, ఐఐటీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి గురువారం ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత మేధావుల ఆధ్వర్యంలో ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్‌ తయారైందని వారు ప్రకటించారు. ఈ కోర్సుకు వన్నె తేవడానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు  https://mst.iitm.ac.in/   వెబ్‌సైట్ చూడొచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని