UP Police: మూడంతస్తుల భవనంలో మంటలు.. పోలీస్‌ సాహసం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగరం బాద్షాహీ నాకా ప్రాంతంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Updated : 18 May 2023 09:13 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగరం బాద్షాహీ నాకా ప్రాంతంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడారు. ఈ క్రమంలో.. మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న గుప్తా అనే వ్యక్తి కుటుంబం మంటల్లోనే చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీస్‌ అధికారి అంకిత్‌ ఖాతానా తన ప్రాణాలకు తెగించి ఆ కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న మరో భవనంపైకి ఎక్కి.. మంటలు వ్యాపించిన మూడో అంతస్తులోని ఇంటి కిటికీ అద్దాలను బూటుకాళ్లతో పగలగొట్టి లోపలికి వెళ్లారు. అంకిత్‌ లోనికి వెళ్లాక.. అక్కడ ఎవరూ లేరని గుర్తించారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు తీసి.. భారీపేలుడు జరగకుండా చూశారు. అంకిత్‌ సాహసాన్ని వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఆయన ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని