జీ-20 వేదికపై నాటు నాటు..

పలు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు.

Published : 23 May 2023 04:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదన్న చరణ్‌.. ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమని చెప్పారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్‌ జరిగిందని గుర్తు చేసుకున్నారు. కశ్మీర్‌ ఎంతో చల్లని ప్రదేశమని, షూటింగ్‌లకు అనువుగా ఉంటుందని చెప్పారు. తాను రెండో తరం నటుడినని, తన తండ్రి చిరంజీవి ఎన్నో చిత్రాలను కశ్మీర్‌లో తీశారని తెలిపారు. ‘నా సినిమాల ద్వారా భారత దేశాన్ని మరింత అందంగా చూపించాలనుకుంటున్నా. నా తదుపరి రెండు చిత్రాల షూటింగ్‌లను విదేశాల్లో జరపాలని కోరుకోవడం లేదు. అయితే నిర్మాత హాలీవుడ్‌ నుంచి ఉంటే మాత్రం చెప్పలేం’ అని చరణ్‌ పేర్కొన్నారు. అనంతరం భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్‌ జె.బోక్‌తో కలిసి చరణ్‌ ‘నాటు నాటు’కు స్టెప్పులేసి అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని