Uttar Pradesh: బతికుండగానే పెద్దకర్మ విందు.. మూడేళ్ల క్రితమే సమాధి సిద్ధం

మూడు పెళ్లిళ్లతో ఏడుగురు పిల్లలున్న తండ్రి జఠాశంకర్‌. అయినా మరణానంతరం పిల్లలు తనకు పెద్దకర్మ కార్యక్రమం చేస్తారో.. లేదో అనే సందేహంతో తానే ఆ ముచ్చట తీర్చుకున్నాడు.

Updated : 17 Jun 2023 07:08 IST

మూడు పెళ్లిళ్లతో ఏడుగురు పిల్లలున్న తండ్రి జఠాశంకర్‌. అయినా మరణానంతరం పిల్లలు తనకు పెద్దకర్మ కార్యక్రమం చేస్తారో.. లేదో అనే సందేహంతో తానే ఆ ముచ్చట తీర్చుకున్నాడు. ప్రత్యేకంగా భోజనాలు వండించి 300 మందికి చక్కటి విందును ఏర్పాటు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్‌ జిల్లాలోని కెవానా గ్రామానికి జఠాశంకర్‌ మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో సమాధి కూడా సిద్ధం చేసుకోవడం మరో విశేషం. కొద్ది వారాల క్రితమే తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని సైతం ఈయన పూర్తి చేశాడు. గురువారం రాత్రి జరిగిన జఠాశంకర్‌ ‘పెద్దకర్మ’కు బంధువులు, గ్రామస్థులు హాజరై విందును ఆరగించారు. ‘‘మరణానికి ముందు ఈ కార్యక్రమం చేయడం మన ఆచారాల్లో భాగం కాదు. అయినా నేను నిర్వహించుకున్నా. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా’’ అని ఆరు పదులు దాటిన జఠాశంకర్‌ చెప్పారు. తాను ఎవరిపైనా ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని