దేవుళ్లకూ ఉండదా ఉక్కపోత!.. ఆలయాల్లో ఏసీలు, కూలర్లు

భక్తులకు కష్టమొస్తే దేవుడికి చెప్పుకొంటారు. దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఇలా ఆలోచించిన భక్తులు పలుచోట్ల గర్భగుడుల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు.

Updated : 18 Jun 2023 08:27 IST

భక్తులకు కష్టమొస్తే దేవుడికి చెప్పుకొంటారు. దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఇలా ఆలోచించిన భక్తులు పలుచోట్ల గర్భగుడుల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. వేసవికాలం ముగుస్తున్నా.. ఎండల తీవ్రత తగ్గట్లేదు. వారణాసి జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దేవుళ్లకు మాత్రం ఈ సమస్య ఉండదా అని భావించిన భక్తులు.. ఉపశమన చర్యలు తీసుకొంటున్నారు. నైవేద్యంగా చల్లని పానీయాలు పెడుతున్నారు. రోజుకు రెండుసార్లు స్నానం చేయిస్తున్నారు. సౌకర్యంగా ఉండేందుకు విగ్రహాలను ఖద్దరు దుస్తులతో అలంకరిస్తున్నారు. ప్రసిద్ధ బడా గణేష్‌ ఆలయం, దుర్గ్‌ వినాయక్‌ గణేశ్‌ మందిర్‌, త్రిదేవ్‌ టెంపుల్‌, బటుక్‌  భైరవ్‌ మందిర్‌, శ్రీ కాశీ విశ్వనాథ వంటి దేవాలయాల్లో.. విరాళాలతో ఏసీలు, కూలర్లు ఏర్పాట్లుచేసినట్లు భక్తులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని