Uttar pradesh: చనిపోయిన తాతయ్యలా ప్రవర్తిస్తున్న మనవడు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఎనిమిదేళ్ల కుర్రాడు పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని.. తల్లి తన కుమార్తెగా, మేనమామలిద్దరూ కుమారులంటూ ఆ బాలుడు చెప్పే మాటలకు కుటుంబసభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు.

Updated : 18 Jun 2023 08:54 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఎనిమిదేళ్ల కుర్రాడు పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని.. తల్లి తన కుమార్తెగా, మేనమామలిద్దరూ కుమారులంటూ ఆ బాలుడు చెప్పే మాటలకు కుటుంబసభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు. 2015 జనవరి 9న ఈ బాలుడి తాత మనోజ్‌మిశ్ర చనిపోయారు. రతన్‌పుర్‌లో పొలానికి నీరు పారించేందుకు వెళ్లి పాముకాటుకు గురై ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో మనోజ్‌ కుమార్తె రంజన నిండుగర్భంతో ఉంది. మనోజ్‌ చనిపోయిన 20 రోజులకు ఆమెకు ఆర్యన్‌ పుట్టాడు. ఆ బాలుడే ఇప్పుడు తానే మనోజ్‌మిశ్ర అంటున్నాడు. జూన్‌ 15న అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్‌ విచిత్రంగా ప్రవర్తించాడు. తన పేరును మనోజ్‌గా చెప్పుకొన్నాడు. అది చూసి ఆర్యన్‌ మేనమామలు.. కన్నీరుమున్నీరుగా విలపించారు. తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని ‘ఆర్యన్‌’ చెప్పాడు. ఈ వార్త విన్న గ్రామస్థులంతా ఆ ఇంటి వద్దకు పెద్దఎత్తున చేరుకొని ముక్కున వేలేసుకొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని