ప్రధాని ఎవరో చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు.. ఆపై వరుడి తమ్ముడితో..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని ఓ యువతి వివాహం చేసుకుంది.

Updated : 21 Jun 2023 07:03 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని ఓ యువతి వివాహం చేసుకుంది. వరుడు.. దేశ ప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. శివశంకర్‌ (27)కు జూన్‌ 11న రంజనతో  వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. జూన్‌ 12న ఉదయం.. పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరని మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేకపోయాడు. ఇది చూసిన వధువు బంధువులు అతణ్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని