Uttar Pradesh: రైతు కుటుంబాల నుంచి రోజుకొకరు ఎలుగుబంటిగా..

విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా రైతులు పడే పాట్లు చెప్పనలవి కావు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ప్రాంత చెరకు రైతులు తమ పంటను కోతుల బారి నుంచి రక్షించుకునేందుకు ఎలుగుబంటి అవతారం ఎత్తుతున్నారు.

Updated : 26 Jun 2023 09:14 IST

విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా రైతులు పడే పాట్లు చెప్పనలవి కావు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ప్రాంత చెరకు రైతులు తమ పంటను కోతుల బారి నుంచి రక్షించుకునేందుకు ఎలుగుబంటి అవతారం ఎత్తుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాకపోవడంతో విసుగుచెందిన రైతులు ఈ ఆలోచన చేశారు. రోజంతా ఎలుగుబంటి వేషధారణలో పొలాల వద్ద చక్కర్లు కొడుతూ పంటకు కాపలా కాస్తున్నారు. కోతులు తరచూ పంటలపై, పక్కనే ఉన్న పశువులపై దాడి చేసి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీంతో రైతులు తలా కొంత డబ్బు పోగు చేసి ఎలుగుబంటి ముసుగు కొన్నారు. రోజుకు ఒకరు ఆ ముసుగు ధరించి పంటలకు రక్షణగా ఉంటున్నారు. రోజంతా ముసుగులోనే ఉండటం కష్టంగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్‌ అనే రైతు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని