Yogi Adityanath Sister Shashi: టీ దుకాణం నడుపుతున్న యూపీ సీఎం యోగి సోదరి!

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోదరి శశి పాయల్‌ ఓ చిన్న గ్రామంలో టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు.

Updated : 05 Jul 2023 09:38 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోదరి శశి పాయల్‌ ఓ చిన్న గ్రామంలో టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్‌ టీ దుకాణం ఉంది. వర్షం పడిందంటే ఆ మార్గంలో వెళ్లడం కూడా  కష్టమే. ఈ వీడియోను మాజీ ఎమ్మెల్యే దినేశ్‌ చౌదరి తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్‌కు ఏడుగురు తోబుట్టువులు. అందులో పెద్దవారు శశి పాయల్‌ కాగా.. యోగి అయిదో సంతానం. కొఠార్‌ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను శశి పాయల్‌ వివాహం చేసుకున్నారు. 1994లో యోగి సన్యసించిన తర్వాత దాదాపు 28 ఏళ్లుగా తన సోదరుడికి రాఖీ కూడా కట్టడం లేదన్న శశి.. ఏటా రక్షబంధన్‌ నాడు కచ్చితంగా రాఖీ మటుకు పంపుతుంటానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని