Costly Saree: అమ్మో.. ఈ చీర రూ.21 లక్షలా!

ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. జీవిత భాగస్వామి నుంచి అతివలు కోరుకునేవాటిలో చీర ముందు వరుసలో ఉంటుంది. పండగలొస్తే ఈ చీరల ధరలు భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి.

Updated : 13 Jul 2023 07:31 IST

ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. జీవిత భాగస్వామి నుంచి అతివలు కోరుకునేవాటిలో చీర ముందు వరుసలో ఉంటుంది. పండగలొస్తే ఈ చీరల ధరలు భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వస్త్రదుకాణంలో విక్రయిస్తున్న రూ.21 లక్షల చీర చూస్తే ఏకంగా మతులే పోతాయి. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి తెలిపారు. దీని తయారీకి రెండేళ్లు పట్టిందన్నారు. స్ఫటికాలతో అందంగా అలంకరించిన ఈ చీరకు షిఫాన్‌, చికన్‌కారీ కుట్లే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని