యూపీలో గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ వ్యక్తి తాగిన మత్తులో గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేశాడు. జులై 11న రాత్రి జవహీర్‌ పటేల్‌, గులాబ్‌కోర్‌ కలిసి మద్యం తాగారు.

Updated : 15 Jul 2023 08:16 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ వ్యక్తి తాగిన మత్తులో గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేశాడు. జులై 11న రాత్రి జవహీర్‌ పటేల్‌, గులాబ్‌కోర్‌ కలిసి మద్యం తాగారు. జవహీర్‌.. పటేల్‌ వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. గులాబ్‌ గిరిజనుడు. మత్తులో వీరిద్దరి మధ్య చిన్న విషయమై వాగ్వాదం జరిగింది. కోపంతో జవహీర్‌.. గులాబ్‌ను దుర్భాషలాడుతూ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో ఉన్నందున ఈ విషయం గులాబ్‌ గుర్తించలేదు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో వైరల్‌ చేశారు. తనకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్న గులాబ్‌.. జవహీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘ఓబరా పోలీస్‌ స్టేషను పరిధిలోని ఘటిహట గ్రామంలో ఈ ఘటన జరిగింది. జవహీర్‌పై కేసు నమోదు చేశాం. ప్రస్తుతానికి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాం’’ అని సోన్‌భద్ర ఎస్పీ యశ్వీర్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని