యువతికి అబ్బాయిగా శస్త్రచికిత్స.. ప్రేయసితో పెళ్లికి దరఖాస్తు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువతుల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది.

Updated : 15 Jul 2023 07:28 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువతుల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరిది బరేలీ కాగా.. మరొకరిది బదాయూ. ఇద్దరూ పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం ప్రారంభించాలని అనుకున్నారు. కుటుంబసభ్యులు దీనికి ససేమిరా అన్నారు. దీంతో ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి కూడా చేయించుకుంది. పూర్తి చికిత్స అనంతరం.. సంబంధిత ధ్రువపత్రంతో సహా స్థానిక సబ్‌ డివిజనల్‌ కోర్టులో రిజిస్ట్రేషన్‌ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. ‘‘ప్రత్యేక వివాహ చట్టం కింద వారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ పెళ్లికి ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. వీరి విషయంలో లింగ మార్పిడి చేసుకున్నాక దరఖాస్తు వచ్చింది. ఇలాంటి కేసు మా ముందుకు రావడం ఇదే తొలిసారి. చట్టం ప్రకారం ముందుకు వెళతాం’’ అని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష్‌ పాండే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని