Tomato: 50ఏళ్లుగా టమాటా సాగు.. ఇప్పుడు పంట పండింది

దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. ఓ రైతును కోటీశ్వరుడిని చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్‌ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్‌ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది.

Updated : 19 Jul 2023 08:31 IST

దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. ఓ రైతును కోటీశ్వరుడిని చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్‌ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్‌ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 50 ఏళ్లుగా టమాటానే సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రం ఆయన పంట పండింది. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించానని.. దీనికి గాను రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు