స్కూలు భవనం పైనుంచి ‘క్రిష్‌’లా దూకిన విద్యార్థి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగరాన వీరేన్‌ స్వరూప్‌ పాఠశాల పై అంతస్తు తరగతి గదిలో టీచరు పాఠం చెబుతుండగా 8 ఏళ్ల విద్యార్థి పైకి లేచి నీళ్లు తాగాలన్నాడు.

Updated : 22 Jul 2023 07:35 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగరాన వీరేన్‌ స్వరూప్‌ పాఠశాల పై అంతస్తు తరగతి గదిలో టీచరు పాఠం చెబుతుండగా 8 ఏళ్ల విద్యార్థి పైకి లేచి నీళ్లు తాగాలన్నాడు. టీచరు అనుమతి ఇవ్వడంతో వరండాలోకి వచ్చిన ఆ విద్యార్థి.. అమాంతం పైనుంచి కిందికి దూకేశాడు. ముక్కుకు, కాళ్లూచేతులకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ని ఎందుకలా దూకావని అడిగితే.. అతడు చెప్పిన సమాధానం విని తల్లితోపాటు అందరూ విస్తుపోయారు. హృతిక్‌ రోషన్‌ నటించిన ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ‘క్రిష్‌’ పాత్రను తాను అనుకరించినట్లు ఆ విద్యార్థి తెలిపాడు. క్రిష్‌లా తాను కూడా క్షేమంగా కిందికి దిగుతానని భావించినట్లు అమాయకంగా చెప్పాడు. విద్యార్థి దూకిన దృశ్యం పాఠశాల సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని