Love: ఫేస్‌బుక్‌లో ప్రేమ.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం తన నలుగురు పిల్లలతో కలసి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ఉదంతం ఇంకా వార్తల్లో ఉండగానే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం గమనార్హం.

Updated : 24 Jul 2023 08:32 IST

పెషావర్‌, జైపుర్‌: పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం తన నలుగురు పిల్లలతో కలసి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ఉదంతం ఇంకా వార్తల్లో ఉండగానే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం గమనార్హం. ఈసారి ఓ భారతీయ మహిళ ఫేస్‌బుక్‌ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్‌లో అడుగుపెట్టింది.

పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. అంజు(34), అర్వింద్‌ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు గురువారం వాయవ్య పాక్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని