Viral Video: పగబట్టినట్లుగా ఎద్దు.. భయపడి చెట్టెక్కిన రైతు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఎద్దుకు భయపడిన ఓ రైతు చెట్టెక్కాడు. రెండు గంటలపాటు చెట్టుపైనే ఉండిపోయిన అతణ్ని ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోనుతో చిత్రీకరించారు.

Updated : 31 Jul 2023 07:39 IST

త్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఎద్దుకు భయపడిన ఓ రైతు చెట్టెక్కాడు. రెండు గంటలపాటు చెట్టుపైనే ఉండిపోయిన అతణ్ని ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోనుతో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సైతం స్పందించారు. రస్డా పోలీస్‌స్టేషను పరిధిలో.. దారితప్పిన ఓ ఎద్దు వల్ల గత కొన్నిరోజులుగా 12 మంది గాయపడ్డారు. ఈ ఎద్దు శుక్రవారం ఖఖ్ను అనే రైతు వెంటపడింది. భయంతో పరుగెత్తిన రైతు చెట్టు ఎక్కినా ఎద్దు అక్కడి నుంచి కదల్లేదు. పగబట్టినదానిలా కదిలితే బెదిరిస్తూ అలాగే ఉండిపోయింది. ఈ ఘటనపై అఖిలేశ్‌ స్పందిస్తూ ఇలాంటి ఎడ్లను అరికట్టేందుకు బుల్‌ ప్రొటెక్షన్‌ పోలీసులను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఇలా దారితప్పిన ఆవులను ఇప్పటివరకు దాదాపు 3,910 వరకు సంరక్షణ కేంద్రాల తరలించామని అధికారులు చెప్పారు. కాగా, వైరల్‌ వీడియోలోని ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం కార్యరంగంలోకి దిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని