Ayodhya: అయోధ్య ఆలయం కోసం 400 కిలోల తాళం

అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు 400 కేజీల బరువైన తాళం తయారు చేశారు. తాళాల నగరంగా పేరున్న అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ రాముడి భక్తుడు.

Updated : 07 Aug 2023 06:56 IST

యూపీ నిపుణుడి ప్రతిభ

అలీగఢ్‌: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు 400 కేజీల బరువైన తాళం తయారు చేశారు. తాళాల నగరంగా పేరున్న అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ రాముడి భక్తుడు. తాళాల తయారీలో నిపుణుడు కూడా. ఆయన కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది. మరోవైపు, అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్‌ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని సిద్ధం చేశారు. దీనిని త్వరలోనే అయోధ్యలో రామాలయ అధికారులకు అందజేయనున్నారు. అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారుచేశానని శర్మ తెలిపారు. ఈ తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్‌ ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం శర్మ తాళానికి సంబంధించి అతి సూక్ష్మ మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నారు. ఈ తాళం తయారీలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని, తయారీకి రూ.2 లక్షలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని