మహారాష్ట్రలో దొంగల భయంతో టమాటా తోటకు సీసీ కెమెరాలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలకు రెక్కలు రావడంతో.. టమాటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీల వంటి వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Published : 09 Aug 2023 05:52 IST

దేశవ్యాప్తంగా టమాటా ధరలకు రెక్కలు రావడంతో.. టమాటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీల వంటి వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాకు చెందిన శరద్‌ రావత్‌ అనే రైతు టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడు. ఇందుకు రూ. 22 వేలు వెచ్చించినట్లు తెలిపాడు. మహారాష్ట్రలో ప్రస్తుతం కేజీ టమాటాల ధర రూ.160 ఉంది. సోమవారం కర్ణాటకలోని కోలారు నుంచి రాజస్థాన్‌లోని జైపుర్‌కు వెళ్తున్న టమాటా లోడు అదృశ్యమైంది. ఇందులో సుమారు రూ. 21 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని