నేపాల్‌లో హోటల్‌.. యూపీలో గెస్ట్‌హౌస్‌.. ఈ దొంగ మామూలోడు కాదు

దిల్లీ పోలీసులు 200కు పైగా చోరీలు చేసిన ఓ మిలియనీర్‌ దొంగను పట్టుకున్నారు. దొంగ సొమ్ముతో రూ.కోట్ల ఆస్తులు పోగేసిన ఈ వ్యక్తి కనీసం భార్యకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్తపడటం మరో విశేషం.

Updated : 17 Aug 2023 07:55 IST

దిల్లీ పోలీసులు 200కు పైగా చోరీలు చేసిన ఓ మిలియనీర్‌ దొంగను పట్టుకున్నారు. దొంగ సొమ్ముతో రూ.కోట్ల ఆస్తులు పోగేసిన ఈ వ్యక్తి కనీసం భార్యకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్తపడటం మరో విశేషం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్దార్థ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మనోజ్‌ చౌబే 1997లో దిల్లీకి వలస వచ్చి కీర్తినగర్‌లో ఓ క్యాంటీను ప్రారంభించాడు. మరోవైపు దొంగతనాలు చేస్తూ.. జైలుకు కూడా వెళ్లాడు. చోరీల సొమ్ముతో నేపాల్‌లో ఓ హోటలు నిర్మించాడు. ఆ తర్వాత యూపీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పార్కింగ్‌ కాంట్రాక్టు తీసుకున్నానని భార్యను నమ్మించి.. ఏడాదిలో 8 నెలలు దిల్లీ వైపే ఉండేవాడు. దొంగ సొమ్ముతో యూపీలో భార్య పేరిట ఓ అతిథిగృహం, లఖ్‌నవూలో ఇల్లు కట్టాడు. పలు స్థిరాస్తులు కొని లీజుకు ఇచ్చాడు. ఈ ఆస్తులతో ప్రతినెలా రూ.2 లక్షలు అద్దెల రూపంలో వస్తాయి. మనోజ్‌ వ్యవహారంపై దిల్లీ పోలీసులకు ఇటీవల అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. గుట్టంతా బయటపెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు