అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా డీజీపీ విజయ్‌కుమార్‌.. పోలీస్‌ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు.

Published : 22 Aug 2023 04:10 IST

పోలీసులకు హిందూ పంచాంగం పంపిన డీజీపీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా డీజీపీ విజయ్‌కుమార్‌.. పోలీస్‌ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. అందులో హత్య, దోపిడీ, దొంగతనం వంటి ఘటనలను అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సమయంలో జరిగే నేరాలను నియంత్రించాలని కోరారు. లేఖతోపాటు హిందూ పంచాంగాన్నీ పంపారు. దాని సహాయంతో.. అమావాస్యకు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత ఎక్కువగా జరిగే నేరాలను అరికట్టడానికి గస్తీ కాయాలని ఆదేశించారు. సెప్టెంబరులో 14వ తేదీ, అక్టోబరులో 14వ తేదీల్లో అమావాస్య తిథి.. కాబట్టి ఈ తేదీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని