Heart Attack: గుండె ఆగడానికి ముందు హెచ్చరిక సంకేతాలు ఇలా..

ఆసుపత్రి బయట గుండె ఆగిపోయిన (కార్డియాక్‌ అరెస్ట్‌) కేసుల్లో 90 శాతం ఆకస్మిక మరణానికి దారితీస్తాయి. దీనికి ముందు కనిపించే లక్షణాల్లో కొన్ని స్త్రీపురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.

Updated : 29 Aug 2023 07:58 IST

దిల్లీ: ఆసుపత్రి బయట గుండె ఆగిపోయిన (కార్డియాక్‌ అరెస్ట్‌) కేసుల్లో 90 శాతం ఆకస్మిక మరణానికి దారితీస్తాయి. దీనికి ముందు కనిపించే లక్షణాల్లో కొన్ని స్త్రీపురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.  స్త్రీలు కార్డియాక్‌ అరెస్ట్‌కు ముందు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారని, పురుషులకైతే ఛాతీ నొప్పి వస్తుందని అధ్యయనంలో తేలింది. అమెరికాలోని సీడర్స్‌ సినాయ్‌ వైద్య కేంద్రానికి చెందిన స్మిట్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ అధ్యయనం చేసింది.

కార్డియాక్‌ అరెస్టుకు 24 గంటల ముందు  50% మందిలో ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె లయతప్పడం వంటి లక్షణాల్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. కొందరు స్త్రీపురుషులు గుండె దడకు లోనవుతారని, మూర్చ వచ్చినట్లు అనిపించడంతోపాటు ఫ్లూ జ్వరం వంటి లక్షణాలూ కనిపిస్తాయని వెల్లడించింది. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం.. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల ఆకస్మిక మరణాలను నివారించడానికి తోడ్పడుతుందని అధ్యయనకర్తల్లో ఒకరైన సుమీత్‌ చగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని