Non-Vegetarian Food: మాంసాహారం వల్లే ప్రకృతి విపత్తులు: ఐఐటీ మండీ డైరెక్టర్‌ వ్యాఖ్య

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న విపత్తులను జీవహింసతో ముడిపెడుతూ ఐఐటీ మండీ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Updated : 08 Sep 2023 09:26 IST

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న విపత్తులను జీవహింసతో ముడిపెడుతూ ఐఐటీ మండీ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజల మాంసాహారపు అలవాట్లు, జీవహింస వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా మాంసాహారాన్ని తినబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ‘‘అమాయకమైన జంతువులను వధిస్తున్నారు. పరస్పరాధారిత సహజీవి సంబంధం వల్ల ఇది పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది. తక్షణమే మనకు కనిపించకున్నా దాని దుష్ప్రభావమైతే తప్పదు. అనేక ఉత్పాతాలు తరచూ సంభవిస్తుంటాయి. ఇదంతా మనుషులు మాంసాహారాన్ని భుజించడం వల్లే’’నంటూ లక్ష్మీధర్‌ బెహరా విద్యార్థులతో చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిలోకి వచ్చింది. ‘మంచి మనుషులుగా మారాలంటే మాంసం తినకూడద’ని ఆయన హితబోధ చేశారు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని