70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. ప్రారంభోత్సవానికి పిలవలేదని కట్‌!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు.

Updated : 13 Sep 2023 05:47 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లూ మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ పైన కావాలంటే పక్క గ్రామాలకు నడిచివెళ్లి తెచ్చుకోవాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ జిల్లా లహురియాదహ్‌ గ్రామస్థుల కష్టాలివి. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్‌ కలెక్టర్‌ దివ్యా మిత్తల్‌ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద ఆగస్టు 29న గ్రామంలో కొళాయిలు ఏర్పాటు చేయించారు. గ్రామానికి తాగునీరు అందిన మూడు రోజుల్లోనే కలెక్టర్‌ మరోచోటుకు బదిలీ అయ్యారు. కొళాయిల పైపులను గుర్తుతెలియని వ్యక్తులు కట్‌ చేశారు. గ్రామస్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. తెర వెనుక ఏమి జరిగిందంటే.. జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని