లైంగిక వేధింపులకు గురైనందుకే.. మంత్రి పదవికి రాజీనామా

లైంగిక వేధింపులకు గురైనందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఓ మహిళా నేత ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఎన్నార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చంద్రప్రియాంక మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 12 Oct 2023 07:00 IST

పుదుచ్చేరి మంత్రి చంద్రప్రియాంక

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: లైంగిక వేధింపులకు గురైనందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఓ మహిళా నేత ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఎన్నార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చంద్రప్రియాంక మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ప్రజలకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. ‘అణగారిన వర్గానికి చెందిన నేను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు గురయ్యాను. ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ మంత్రిగా కొనసాగలేను’ అని ప్రియాంక లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆమెను ఇలా ఇబ్బంది పెట్టింది ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత మహిళకు మంత్రివర్గంలో స్థానం లభించగా ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని