గుజరాత్‌లో అకాల వర్షాలు

గుజరాత్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు.

Published : 28 Nov 2023 04:35 IST

 పిడుగుపాటుకు పలు జిల్లాల్లో 27 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోనూ నలుగురి మృత్యువాత

అహ్మదాబాద్‌, భోపాల్‌: గుజరాత్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోనూ నలుగురు మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లోని మొత్తం 252 తాలూకాల్లో 234 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. సూరత్‌, సురేంద్రనగర్‌, ఖేడా, తాపి, భరూచ్‌లలో 16 గంటల్లో రికార్డుస్థాయిలో 50-117 మి.మీ వర్షపాతం నమోదైంది. దాహుద్‌, తాపి, డాంగ్స్‌, అమ్రేలీ, సురేంద్రనగర్‌, మెహ్‌సాణా, ఖేడా, పంచమహల్‌, సాబర్‌కాంఠా, భరూచ్‌, అహ్మదాబాద్‌, ద్వారకా జిల్లాల్లో పిడుగులు పడి మొత్తం 27 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధార్‌ జిల్లా ఉమర్బన్‌ గ్రామంలో పిడుగుపాటుకు దంపతులు ప్రాణాలు కోల్పోగా.. ఝాబువా, బర్వాజీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాజస్థాన్‌, మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని