రన్‌వేపై బారాత్‌.. విమానంలో వివాహం

యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

Published : 28 Nov 2023 04:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఓ ప్రైవేటు విమానంలో అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. భారత్‌కు చెందిన దిలీప్‌ పోప్లీ అనే వ్యక్తి యూఏఈలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఆయన తన కుమార్తె విధి పోప్లీ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అందుకు ప్రైవేట్‌ బోయింగ్‌-747లో ఏర్పాట్లు చేశారు. వరుడు హృదేశ్‌ సైనాని పెళ్లి దుస్తులు ధరించి బ్యాండ్‌ బారాత్‌తో డాన్స్‌ చేస్తూ విమాన రన్‌వే వరకు వచ్చారు. ఈ వేడుకకు 300 మంది అతిథులు హాజరయ్యారు. వధూవరులు, అతిథులతో విమానం దుబాయ్‌ ప్రైవేట్‌ టెర్మినల్‌ నుంచి ఒమన్‌కు బయలుదేరింది. విమానం గగనతలంలో ఉండగానే ఈ జంట వివాహం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని