రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె

హరియాణాలోని ఝజ్జర్‌ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది.

Published : 28 Nov 2023 04:35 IST

హరియాణాలోని ఝజ్జర్‌ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. భారీ ధర పలికినందుకు ఆ గేదె యజమాని నోట్లతో తయారు చేసిన మాలవేసి దానికి ఘనంగా వీడ్కోలు పలికాడు. ‘‘ఈ గేదె రోజుకి 26 లీటర్ల పాలు ఇస్తుంది. దీన్ని అంతకుముందు మా గ్రామానికి చెందిన వికాస్‌ వద్ద రూ.78 వేలకు కొన్నాను. ఆ తర్వాత గేదె తినే ఆహారం ఇతర విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నాను. ప్రస్తుతం దీని వయసు ఆరేళ్లు. ఇప్పుడు మా గ్రామవాసి మల్వీంద్ర అనే వ్యక్తి రూ.4.60 లక్షలతో దీన్ని కొనుగోలు చేశాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత ఖరీదైన గేదె ఇదే’’ అని యజమాని రణవీర్‌ షియోరాన్‌ పేర్కొన్నారు.

 ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని